ఆదర్శ కుటుంబం’ మళ్లీ బ్రేక్‌

05-10-2026 | 05:51pm

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌ డిలే.. వెంకీ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ!

వెంకటేష్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా(Adarsha Kutumbam movie)కు మరోసారి బ్రేక్‌ పడింది. అక్టోబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ(Naga Vamsi) వెల్లడించారు. సినిమాకు మరింత మెరుగైన అవుట్‌పుట్‌ అందించాలనే ఉద్దేశంతోనే రిలీజ్‌ను వాయిదా వేసినట్లు నిర్మాత తెలిపారు.

దీంతో ఇప్పటికే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెంకటేష్‌(v) అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. వెంకటేష్‌–త్రివిక్రమ్‌(Venkatesh Trivikram) కాంబినేషన్‌ కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రిలీజ్‌ వాయిదా వార్తతో అసలు కొత్త విడుదల తేదీ ఎప్పుడు? అనే చర్చ మొదలైంది. మరి ఆలస్యం చేసినా.. థియేటర్లలోకి వచ్చాక సినిమా అంచనాలను అందుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే!

మరిన్ని వార్తలు