తాడువాయిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలి..

05-10-2026 | 06:06pm

తాడ్వాయి, అక్టోబర్ 05 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడువాయి మండల కేంద్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్(MLA Madan Mohan)కు ప్రతినిధులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీటి సమస్య నెలకొందని ఎమ్మెల్యేకు తెలిపారు. చిట్యాల రోడ్డులో ఉన్న బోరు బావి నుంచి తాడువాయి గ్రామ వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల పైపులైనుకు లీకేజీలు కావడంతో నీళ్లు వృధాగా పోతున్నాయని దీంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని తెలిపారు.

ఈ విషయమై స్పందించి న్యాయం చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చిట్యాల రోడ్ లో ఉన్న బోరుబావి నుంచి గ్రామం వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల పైపులైన్ ను ఏర్పాటు చేయాలని ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులతో మాట్లాడారు.రూ.60 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు చేసి గ్రామంలో గత 30 ఏళ్లుగా ఉన్న తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షులు మేకల రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, నాయకులు అంబీర్ శ్యామ్ రావు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు