బిక్కనూర్‌లో వ్యక్తి అదృశ్యం
భిక్కనూర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): బిక్కనూర్ పోలీస్‌స్టేషన్(Bhiknoor Police Station) పరిధిలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఏదుల్మియా (60) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ ఎస్. అనిల్ తెలిపారు. సెప్టెంబర్ 25న సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదని భార్య మొహమ్మద్ మైమూదా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
అదృశ్యమైన వ్యక్తి తెలుపు రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉంటారని, సుమారు ఆరు అడుగుల ఎత్తు, శ్యామల వర్ణం, కోలముఖం, తెల్లటి గడ్డం, తెల్లటి వెంట్రుకలు కలిగి ఉంటారని తెలిపారు. తెలుగు, హిందీ భాషలు మాట్లాడగలడని, ఆయన వద్ద సెల్‌ఫోన్ లేదని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు బిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ అనిల్ కోరారు.