మంచిరామిలో ఉచిత వైద్య శిబిరంకు స్పందన

21-09-2026 | 05:38pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామం(Manchirami village)లో సోమవారం  సర్పంచ్ ఉప్పు లక్ష్మి , రిటైర్డ్ ఐపీఎస్ అధికారి తిరుపతి  ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి(Karimnagar Medicover Hospital) వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి(Free medical camp) అపూర్వ స్పందన లభించింది. ఇందులో  జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బీరకాయల లోకేష్ వైద్య సేవలు అందించి, అవసరమైన వారికి బీపీ, షుగర్, ఈసీజీ,  పరీక్షలు నిర్వహించి వ్యాధులను నిర్ధారించారు.ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, గాదే విద్యాసాగర్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు