ఉచిత ఛాతీ ఎక్స్రే శిబిరానికి విశేష స్పందన
110 మందికి వైద్య పరీక్షలు
మంథని, అక్టోబర్ 05 (విజయక్రాంతి): మంథని మున్సిపల్(Manthani Municipal) పరిధిలోని 10వ వార్డులో సోమవారం నిర్వహించిన ఉచిత ఛాతీ ఎక్స్రే వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. తమ్మిచేరు కట్ట సమీపంలోని పిల్లల పార్కు ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 110 మంది ఛాతీ ఎక్స్రే పరీక్షలు* చేయించుకున్నట్లు కౌన్సిలర్లు పెంటరి రాజు, నూకల కమల్ తెలిపారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మాధురి, వైద్య సిబ్బంది ఆర్. శ్రావణి, జి. అనూష, దామోదర్, స్వామి, హెచ్ఈఓ శ్రీనివాస్, ఏఎన్ఎంలు డి. రమ, ఆర్. సంధ్య, వి. అనురాధ, పి. రేవతి, ఏ. స్వరూప రాణి, బి. రాధ తదితరులు పాల్గొన్నారు. గద్దలపల్లి ఆరోగ్య కేంద్ర సిబ్బంది కూడా సేవలందించారు.