చికిత్స కోసం రూ.1.25 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ మంజూరు

01-10-2026 | 09:36pm

అనారోగ్యంతో బాధపడుతున్న గట్టయ్యకు మంత్రి శ్రీధర్‌బాబు భరోసా

ముత్తారం, అక్టోబర్ 01 (విజయ క్రాంతి): అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ గ్రామానికి చెందిన మండల గట్టయ్యకు వైద్య ఖర్చుల కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Dudilla Sridhar Babu) చొరవతో రూ.1.25 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీ మంజూరైంది. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్యకు ఆర్థిక సహాయం అవసరమని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.1,25,000 ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. మంత్రిగారి ఆసుపత్రి సహాయకులు హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎల్‌ఓసీ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన మంత్రి శ్రీధర్‌బాబుకు గట్టయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు