ప్రజాధనం లెక్కలు అడిగిన బిజెపి నాయకులు

31-10-2026 | 10:26pm

ఆర్టిఐ ఆక్ట్  ద్వారా నిధుల వివరాలు కోరుతూ కమిషనర్ కి దరఖాస్తు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ నూతన పాలక వర్గం ఫిబ్రవరి 17 2026 నుండి అభివృద్ధి కోసం విడుదల అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులపై పూర్తి వివరాలు వెల్లడించాలని, విడుదలైన నిధుల వివరాలు, వాటి వినియోగంపై పారదర్శకతతో వివరణ కోరుతూ... సుల్తానాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ టి. రమేష్ కి RTI act (Farm"A")ద్వారా వివరాలు ఇవ్వాలని బిజెపి నాయకులు శనివారం కోరడం జరిగింది.

సుల్తానాబాద్ మున్సిపాలిటీ(Sultanabad Municipal) పరిధిలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎంతమేర నిధులు విడుదలయ్యాయి? ఏయే పనులకు ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత నిధులు మిగిలి ఉన్నాయి? చేపట్టిన పనుల వివరాలు ఏమిటి? అనే అంశాలపై పూర్తి సమాచారాన్ని కోరుతూ... RTI చట్టం ద్వారా ఫారం–A కింద సమాచార హక్కు దరఖాస్తు సమర్పించి వివరాలు కోరారు. ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు మాట్లాడుతూ.. ప్రజల సొమ్ము ప్రజల అభివృద్ధికి ఎంత వరకు వినియోగించబడిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

సుల్తానాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఈ సమాచారాన్ని కోరడం జరిగింది అని ప్రజలకు నిజాలు తెలియాలి… అభివృద్ధి పనుల లెక్కలు ప్రజల ముందు ఉండాలి… ప్రజాధనానికి పూర్తి జవాబుదారీ తనం ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమములో మాజీ సర్పంచ్ లంక శంకర్, జిల్లా కోశాధికారి కామని రాజేంద్రప్రసాద్. జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు చిట్టవేణి సదయ్య, ప్రధాన కార్యదర్శి గుడ్ల వెంకటేష్, ఉపాధ్యక్షులు భూసారపు సంపత్, గజబింకర్ పవన్, నాయకులు బుర్ర సతీష్ గౌడ్, పేరుక రమేష్, అరవింద్ రెడ్డి, అమీరీశెట్టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు