వాల్మీకి మహర్షి నేల బినోల్‌కు గుర్తింపు ఏదీ?

26-10-2026 | 11:25am

బోధన్, అక్టోబర్ 26 (విజయ క్రాంతి): నవీపేట మండలంలోని జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బినోల గ్రామానికి అక్కడి వాల్మీకి సమాధి ప్రత్యేకతను చాటిచెబుతోంది. రామాయణ గాథను యుగయుగాలకు విస్తరింపజేసిన వాల్మీకి మహర్షి పూర్వాశ్రమంలో బినోల శివారులోని గోదావరి పరీవాహక ప్రాంతంలో సంచరించేవారని, పక్షులను వేటాడేవారని ప్రతీతి. ఇదే ప్రాంతంలో బోధన (Teaching) చేశారని నమ్ముతారు. గ్రామ ముఖద్వారం పక్కన పెద్ద చెరువును ఆనుకుని వాల్మీకి సమాధి ఉంది.

ఈ సమాధిపై ఉన్న రాతి బండలపై లిపి, శాసనాలు (Inscriptions) లిఖించి ఉన్నాయి. దశాబ్దాల కిందట పురాతత్వ శాస్త్రవేత్తలు గ్రామానికి వచ్చి సమాధిని పరిశీలించి, శాసనాల పరిశోధన కోసం ఫొటోలు తీసుకెళ్లారు. పవిత్ర కాశీలో ఉన్న ఆలయాలు బినోలలో ఉన్నాయని, వాల్మీకి మహర్షి సమాధి సైతం ఇక్కడే ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వాల్మీకి బండపై లిఖించిన శాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

దక్షిణ కాశీగా పేరు పొందిన బినోల గ్రామాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి. వాల్మీకి మహర్షి ఇక్కడే తపస్సు చేసి రామాయణాన్ని రచించినట్లు ప్రతీతి. ఆయన సమాధి ఇక్కడే ఉంది. ఈ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లిన పురాతత్వ శాస్త్రవేత్తలు మళ్లీ ఇక్కడికి రాలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు (Recognition) కల్పించి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

మరిన్ని వార్తలు