Jio IPO ధర ఫిక్స్.. రికార్డు డిమాండ్

26-10-2026 | 11:52am

1.39 కోట్ల అప్లికేషన్లు.. జియో IPOతో మార్కెట్‌లో సంచలనం!

ముంబై, అక్టోబర్ 26 (విజయక్రాంతి): దేశీయ Stock Marketలో మరో భారీ Listingకు రంగం సిద్ధమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ సర్వీసెస్ విభాగం Jio Platforms తన Initial Public Offering (IPO) షేర్ ధరను ఖరారు చేసింది. ఒక్కో షేరుకు రూ.1,119గా నిర్ణయించింది. ఇది కంపెనీ ప్రకటించిన Price Bandలో గరిష్ఠ ధర. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన రావడంతో ఈ ధరను ఫిక్స్ చేశారు. అక్టోబర్ 28, బుధవారం స్టాక్ మార్కెట్‌లో షేర్లు లిస్ట్ కావాల్సి ఉండగా, కంపెనీ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

జియో ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన రూ.30,188 కోట్ల Public Issue అక్టోబర్ 21న ప్రారంభమై, అక్టోబర్ 23న ముగిసింది. మొత్తం 22.2 రెట్లు Subscription నమోదైంది. Public Issueతో పాటు Anchor Investors నుంచి వచ్చిన డిమాండ్ కలిపి రూ.7.4 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు 1.39 కోట్ల Applications రావడం ఈ IPOపై మార్కెట్‌లో ఉన్న ఆసక్తిని సూచిస్తోంది. ఈ స్పందనతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద Public Issueగా జియో IPO నిలిచింది. 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.27,859 కోట్ల IPOను కూడా ఇది అధిగమించింది.

IPO ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్వెస్టర్లు భారీగా బిడ్లు దాఖలు చేశారు. నివేదికల ప్రకారం, కేవలం 100 నిమిషాల్లోనే ఈ ఇష్యూ పూర్తిగా Subscribe అయింది. Qualified Institutional Buyers (QIB) కోసం కేటాయించిన రూ.5,500 కోట్ల వాటా కూడా మొదటి 10 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయినట్లు సమాచారం. ఈ రికార్డు స్థాయి స్పందనతో Jio Platforms మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని అతిపెద్ద Listed Companiesలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే, అసలు Listing సమయంలో షేరు ధర ఎలా కదులుతుంది, ఇన్వెస్టర్లకు ఎలాంటి లాభనష్టాలు వస్తాయన్నది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని వార్తలు