రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం
యూపీలో రాహుల్ కాన్వాయ్‌కు Accident.. అంబులెన్స్ సహా వాహనాలు ఢీ!
లక్నో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు వెళ్తుండగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే (Purvanchal Expressway)పై ఆయన కాన్వాయ్ వెనుక ఉన్న వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఐదు వాహనాలతో పాటు ఓ అంబులెన్స్ ఈ ఘటనలో చిక్కుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారు మాత్రం ప్రమాదానికి గురికాలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని సమాచారం. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ గందరగోళం నెలకొంది.
సుల్తాన్పూర్ జిల్లాలోని హలియాపూర్ ప్రాంతం సమీపంలో ఈ Road Accident జరిగినట్లు సమాచారం. కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అయితే గాయపడిన వారి సంఖ్య, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
2018లో కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ చేసినట్లు ఆరోపణలు ఉన్న వ్యాఖ్యలకు సంబంధించి సుల్తాన్పూర్ ప్రత్యేక MP-MLA కోర్టులో పరువునష్టం కేసు (Defamation Case) కొనసాగుతోంది. ఈ కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కోర్టుకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరి లక్నోకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుల్తాన్‌పూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోర్టు పరిసరాల్లో భద్రతను కూడా అధికారులు కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.