అధికార పార్టీలో ఆ సర్పంచులకు ప్రాధాన్యం లేదంట?
- పార్టీ వీడేందుకు సిద్ధం!
- 10 రోజులు డెడ్ లైన్ అంట
- ఆ మండల గ్రామాల్లో పెరుగుతున్న అసమ్మతి..
- మంచినీళ్లు తాపని సర్పంచ్ ఉంటే ఎంత పోతే ఎంతంట?
- ఆ గ్రామానికి రెండవ విడత లో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంట
మహమ్మదాబాద్ అక్టోబర్ 25 : వడ్డించేవారు మన వారైతే ఏ మూలన కూర్చున్న మనకు కావలసినవి మన దరికి చేరుతాయని పెద్దలు(Elders) అంటుంటారు.. ఈ మండల పరిధిలో అలా జరగడం లేదంట. అధికారం వారిదే ఉన్నా వారికి కావలసినవి మాత్రం ఎంత అడిగినా వారి దరిదాపుల్లోకి కూడా రావడం లేదంట. కనీస సౌకర్యాలు(Basic amenities) కల్పించండి మహ ప్రభో అంటూ చెప్పి చెప్పి వి సుగెత్తిపోతున్నారంట. ఎలాగైనా తమ పా ర్టీని అధికారంలోకి తీసుకురావాలని దృఢ సంకల్పంతో నిరంతరం శ్రమించిన సీనియ ర్ కాంగ్రెస్ నాయకులు(Congress leaders), కొందరు సర్పంచులకు తీవ్ర నిరాశ మిగులుతుందంట.
అధికా ర పార్టీ అంటేనే మండల పరిధిలోనే కాదు జిల్లా రాష్ట్ర స్థాయిలోను ప్రత్యేక గౌరవంతో పాటు ఏ పనైనా ఎక్కడ ఆగకుండా జనాల్లో జరిగిపోతుందని అనుకోవడం సహజం. అ ధికార పార్టీలో ఉండేందుకు కూడా ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపించడం చూస్తుంటాం. మహమ్మాదాబాద్ మండల పరిధిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీలోని సర్పంచులు.
కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. దాదాపు మూడేళ్లు కావస్తున్నా అధికార పార్టీలో ఉండి ఎలాంటి ఉపయోగం లేదని కొందరు సర్పంచులు చెబుతున్న మాట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సైతం ఈ సర్పంచ్ల కాలంలోనే రావడంతో ఇంత నిర్లక్ష్యం చేస్తే ఈ పా ర్టీలో ఎలా కొనసాగాలని అధికారం ఉన్నప్పుడే పక్కకు జరిగితే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎవరికి వారి అంచనాలు వేసుకుంటూ పక్క పార్టీలవైపు చూస్తున్నారు అంట. ఈ విషయంపై మండల వ్యాప్తంగా రోజురోజుకు చర్చ రూపొందుకుంటుంది.
అసంతృప్తి చర్చనీయాంశంగా మారుతోందా?
అధికార పార్టీలో సర్పంచుల అసంతృప్తి చర్చనీయాంశంగా మారుతోంది. గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో తగిన ప్రాధాన్యం లభించడం లేదనే భావన కొందరు సర్పంచ్ లలో నెలకొన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నప్పటికీ, వారికి తగిన గుర్తింపు దక్కడం లేదంట.
గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిధులు, అధికారుల స హకారం అవసరమని, అయితే కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రజల్లో తమపై వ్యతిరేకతకు కారణమవుతున్నాయని సర్పంచులు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితులపై పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్పందన రావ డం లేదనే అభిప్రాయం వారిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పది రోజుల్లో ఉత్తమ తింటే నేను తీసుకుంటామని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సర్పంచులు చెప్పడం ఏ అంశం ప్రత్యేక చర్చకు దరితిస్తుంది.
ఈ సర్పంచుల హయాంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు
ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవీకాలం ముగియకముందే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ప్ర స్తుత సర్పంచులు ఆయా గ్రామాల్లో ఎంతో కీలకంగా పనిచేసే అవకాశం ఉంది. అసంతృప్తితో ఉన్న కొందరు సర్పంచులు అధి కార పార్టీని వీడే యోచనలో ఉన్నారనే వార్త లు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నా యి.
తమ సమస్యలపై పార్టీ నాయకత్వం స్పందించకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చ ర్చ సాగుతోంది. పార్టీని వీడనున్న సర్పంచు లు ఎవరనే విషయం, వారు ఏ పార్టీలో చేరనున్నారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో పది రోజుల్లో వారు ఆశించిన మేరకు కొంతలో కొంతైనా మేలు జరిగితే తప్ప అధికార పార్టీలో ఉండే అవకాశం లేవని తెలుస్తుంది.
ఈ పరిణామాలపై అధికార పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుంది? అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సర్పంచులను బుజ్జగించి పార్టీలోనే కొనసాగించే ప్రయత్నాలు చేస్తుందా? లేక గ్రామస్థాయిలో రాజకీయ సమీకరణాలు మారుతాయా? అనేది వేచి చూడాలి. సంగయ్య పల్లి తండా కు ఇప్పటి వరకు ఇందిరమ్మా ఇల్లు మొదటి విడతలో ఏడు ఇండ్లు మంజూరు కాగా రెండో విడతలో కనికరించ లేదంట. రెండో విడతలో హామీ ఇచ్చిన ప్రజలకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట.
మార్గమధ్యలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన కొందరు సర్పంచులు..
ఇటీవల మండల పరిధిలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం లో ఎమ్మెల్యే వాహనం ను అపి వారి గోడును కొందరు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు వెళ్ళబోసుకున్నారు. కనీసం గ్రామంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉంచుకుంటే మేము సర్పంచ్ గా చేసింది ఏముంటుందని ఎమ్మెల్యేను అడిగారు.
స్పందించిన ఎమ్మెల్యే అందరి భవిష్యత్తు బాగుంటుందని సమయమానం పాటించాలని ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కాగా పార్టీని సమన్వయం చేయడంలో మం డలంలో తీవ్ర అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయని పార్టీ వర్గాలలో చర్చ జరుగు తుందంట. నిలుపుదల చేయకపోతే భవిష్యత్తు ప్రమాదకర పరిస్థితిలో పడే అవకాశం ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్న మాట.