ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

28-10-2026 | 09:19pm

సిరికొండ, అక్టోబర్ 28 ,(విజయ క్రాంతి):తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు  రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ వీసీ, రిజిస్ట్రార్లకు వినతి పత్రం అందజేశారు. తె.యూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం(T.U. Outsourcing Employees' Association) అధ్యక్షులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ..... ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు.

యూనివర్సిటీ పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యల పట్ల సైతం తీవ్రజాప్యం చేస్తున్నారన్నారు. కాంట్రాక్టు ఏజెన్సీవారు ఉద్యోగుల అకౌంట్లో ప్రతినెల పీఎఫ్, ఈఎస్ఐ  జమచేయకుండా  సొంతానికి వాడుకుంటున్నా, యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడం సరికాదన్నారు. మరణించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి కుటుంబంలో ఒకరికి వెంటనే ఉద్యోగం కల్పించాలన్నారు. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభించాలని, తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, వీసీ, రిజిస్ట్రార్లు హామీ ఇచ్చినట్లు చెప్పారు.కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సురేష్, బికోజి, నాయకులు జే.నరేష్, శ్రీధర్, ఏ.నరేష్, రవీందర్ నాయక్, సతీష్, ఆసిఫ్, పీరు, రమేష్, తిరుపతి, గంగాధర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు