సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికను వాడుకోవాలి
23-11-2026 | 04:55pm
సాలూర, నవంబర్ 23(విజయక్రాంతి) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం(Government) నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని(Public service program) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో బండి నర్సయ్య కోరారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి స్పందన కరవైంది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యలు, వ్యక్తిగత వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే, సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదని ఆయన వెల్లడించారు.