కొత్తూర్ లో గుప్త నిధుల కోసం తవ్వకాలు.?
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెద్ద మోరి తండా శివారు కొత్తూరు గ్రామంలో(Kothur village) ఓ రైతు మొక్కజొన్న పంట సాగు(Corn cultivation) చేసిన భూమిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. ఆదివారం రాత్రి జేసీబీ యంత్రంతో సుమారు 6 అడుగుల లోతు గొయ్యి తవ్వినట్లు చెబుతున్నారు.
గొయ్యి వద్ద పూజలు నిర్వహించిన తర్వాత గుప్తనిధుల కోసం వెతికినట్లు ప్రచారం సాగుతోంది. అయితే అక్కడ గుప్త నిధులు దొరికాయా, లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కాగా తన భూమిలో గత కొంత కాలంగా ఆశించిన విధంగా పంట పండకపోవడంతో భూమి వద్ద దిష్టి పూజలు నిర్వహించామని, అంతే తప్ప గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా నిరాధారం అని రైతు సారంపల్లి కరుణాకర్ రెడ్డి తెలిపారు.