కంటి అద్దాల సరఫరాకు టెండర్ల ఆహ్వానం
మంచిర్యాల క్రైమ్, ( విజయక్రాంతి) : జాతీయ అంధత్వ నివారణ(National Blindness Prevention) కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాకు అవసరమైన కంటి అద్దాల సరఫరా కోసం అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ఈ నెల 22న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు టెండర్ ఫారాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. పూర్తి చేసిన టెండర్ ఫారాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు నస్పూర్‌లోని ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రభుత్వ పని వేళల్లో సమర్పించాలని సూచించారు. ఆసక్తి కలిగిన అర్హత గల ఏజెన్సీలు నిర్ణీత గడువులో టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు.