సంఘ సభ్యుల సంక్షేమం కోసం నిరంతర కృషి

23-11-2026 | 04:52pm
  1. ప్యానల్ సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
  2. ఆర్బివిఆర్ఆర్ పరిషత్ ప్యానల్ అధ్యక్ష అభ్యర్థి కసిరెడ్డి రాణిరెడ్డి 

మానకొండూరు, నవంబర్ 23 (విజయక్రాంతి): రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి(Raja Bahadur Venkataramireddy) (ఆర్బివిఆర్ఆర్) విజ్ఞాన పరిషత్ కు జరగనున్న ఎన్నికల్లో ప్యానల్ సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్యానల్ తరఫున అధ్యక్షురాలి స్థానానికి పోటీ చేస్తున్న కసిరెడ్డి రాణిరెడ్డి కోరారు. సంఘ సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, తిమ్మాపూర్ మండలం లోని పోరండ్ల, మల్లాపూర్, రామకృష్ణ కాలనీ లో విస్తృత  ప్రచారం నిర్వహించారు.

వృద్ధాశ్రమం తో పాటు, బాలికల వసతి గృహం తదితర అభివృద్ధి కార్యక్రమాలు విజ్ఞాన పరిషత్ తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు సైతం అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ ప్యానెల్ సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి, సేవ చేసే భాగ్యం కల్పించాలని రాణిరెడ్డి అభ్యర్థించారు. కార్యదర్శిగా పోటీ చేస్తున్న నరహరి లక్ష్మారెడ్డి, ప్యానెల్ సభ్యులు , రెడ్డి జేఏసీ ఉత్తర తెలంగాణ అధ్యక్షులు పెండ్యాల రాంరెడ్డి, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, రెడ్డి జేఏసీ అధ్యక్షులు ఏనుగు చుక్కారెడ్డి, రాష్ట్ర రెడ్డి సంఘం నాయకులు రావుల కిరణ్ రెడ్డి తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు