త్రిష కొత్త పార్టీ..?

23-11-2026 | 04:37pm

సినిమా గ్లామర్ నుంచి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారా? స్టార్ హీరోయిన్ త్రిష(Star heroine Trisha) చుట్టూ తమిళనాట కొత్త రాజకీయ చర్చ మొదలైంది. ఇప్పటికే విజయ్‌తో డేటింగ్ అంటూ మీడియా హెడ్‌లైన్లలో నిలిచిన ఈ బ్యూటీ.. ఇప్పుడు అభిమానుల పోస్టర్లతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

తిరునెల్వేలిలో త్రిష అభిమానులు 'ఇళయ పురచ్చి తలైవి పెరవాయి' పేరుతో ఓ సామాజిక సేవా సంస్థను ప్రారంభించారు. అయితే ఈ సంస్థకు సంబంధించిన పోస్టర్లలో త్రిషను అచ్చం రాజకీయ నాయకురాలి తరహాలో చూపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పటికే టీవీకే పార్టీ(TVK)తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో త్రిష పేరుతో వెలువడుతున్న ఈ పోస్టర్లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయ్‌తో సంబంధాలపై వస్తున్న ప్రచారాలకు తోడు ఇప్పుడు అభిమానులు రాజకీయ వేదిక(Political Platform)పై ఆమెను ప్రొజెక్ట్ చేస్తుండటంతో కొత్త చర్చ మొదలైంది.

మొన్నటివరకు సినిమాలు, విజయ్‌తో ప్రచారాలు.. ఇప్పుడు రాజకీయ పోస్టర్లు! అసలు త్రిష మనసులో ఏముంది? అభిమానుల హడావుడి వెనుక రాజకీయ వ్యూహం ఉందా? లేక ఇదంతా అభిమానుల అభిమానం మాత్రమేనా? ఇప్పడు తమిళనాడులో త్రిష పేరే హాట్ టాపిక్! 



మరిన్ని వార్తలు