అమ్ధాపూర్‌లో బలి పీఠం ధ్వంసం..
బోధన్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలోని జగజ్జనని మహంకాళి అమ్మవారి మందిరం(Temple of the Universal Mother, Mahankali Ammavaru) సమీపంలో ఉన్న బలి పీఠాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. రాత్రి వేళల్లో జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి, వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఆలయానికి సంబంధించిన బలి పీఠాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.