నేషనల్ ఆర్చరీ టోర్నీకి టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ
బోధన్, నవంబర్ 25 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఖేలో ఇండియా ఆర్చరీ(Khelo India Archery) కోచ్ మురళీకి అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్‌లో నిర్వహించనున్న పోలీస్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగే ఆర్చరీ పోటీలకు ఆయన టెక్నికల్ అఫీషియల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ మురళీ నియామక పత్రాన్ని విడుదల చేశారు. ఆర్చరీ క్రీడలో ఆయనకు ఉన్న అనుభవం, సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నియామకం పట్ల క్రీడాభిమానులు, ఆర్చరీ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తూ మురళీకి అభినందనలు తెలిపారు.