నూతన దంపతులను ఆశీర్వదించిన రాణా ప్రతాప్ రెడ్డి

25-11-2026 | 07:17pm

నల్లబెల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): మండలంలోని బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన జక్కి అరుణ–ప్రభాకర్ దంపతుల కుమారుడు అనిల్, శ్రావికల వివాహ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్ రెడ్డి(Gogula Rana Pratap Reddy) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్‌గౌడ్, గ్రామ అధ్యక్షుడు భూమ నరేష్, యువమోర్చా మండల అధ్యక్షుడు తిమ్మాపురం శివ, మన్ కీ బాత్ కన్వీనర్ ధర్మారం క్రాంతికుమార్, నాయకులు కక్కెర్ల సమయ్య. తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు