బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులుగా కొలిచెలిమి మల్లేష్

25-11-2026 | 07:46pm

ఘట్ కేసర్, నవంబర్ 25 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షులుగా కొలిచెలిమి మల్లేష్(Kolichelimi Mallesh) నియమితులయ్యారు. అలాగే డివిజన్ మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా ఎస్.కె. సలీం నియమితులయ్యారు. ఈ మేరకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ చేతుల మీదుగా బుధవారం వారికి నియామకపు పత్రాలను అందజేశారు. బిజెపి నాయకులుగా పార్టీ బలోపేతానికి అలాగే రైతులు, మైనార్టీల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని గుర్తించి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులుగా మల్లేష్ ను, మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా ఎస్.కె. సలీంను నియమించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం మాపై పెట్టిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఎదులాబాద్ డివిజన్ పరిధిలో బిజెపి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా నాయకులు గుండ్ల బాలరాజ్, బస్వ రాజు గౌడ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు