నాగర్ కర్నూల్ ను కరువు జిల్లాగా ప్రకటించి 500 కోట్లు కేటాయించలి
సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కార్యదర్శి బి శివవర్మ
కొల్లాపూర్ నవంబర్ 25: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కార్యదర్శి బి శివ వర్మ(Shiva Varma) ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అచ్చంపేట ప్రాంతానికి ఈనెల 26వ తేదీన వస్తున్న సందర్భంగా గతంలో జిల్లాకు వచ్చినటువంటి హామీలను ఈ సందర్భంగా ఆయనకు గుర్తుకు చేస్తా ఉన్నాం. ఎండిపోయిన పత్తి మిర్చి, ఇతరవాణిజ్య పంటలకు ఎకరాకు 50 వేలు, ఆహార పంటలకు ఎకరానికి 30000 చెల్లించాలి.
జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. 500 కోట్లు కరువు సహాయక చర్యలు చేపట్టాలి. వారు డిమాండ్ చేశారు. కొల్లాపూర్ పెంట్లవెల్లి మండలాలు కరువు మండలంగా ప్రకటించాలి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతంగ నికి సాగునీరు త్రాగినీరు అందించాలి. శ్రీశైలం నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతాంగానికి పునరావాసం కల్పించాలి కొల్లాపూర్ ప్రాంతంలో ఆర్ అండ్ బి రోడ్లను ప్రతి ఊరుకు వేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి ఈ సమస్యలు పరిష్కరించని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలని ఉధృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం తారా సింగ్, పార్టీ కొల్లాపూర్ టౌన్ కార్యదర్శి ఎం డి సలీం, మండల కమిటీ సభ్యులు రామకృష్ణ, సాయికుమార్, శ్రీనివాసులు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.