ఖేలో ఇండియా 2026 పోటీలకు సీఎం కీలక ఆదేశాలు

25-11-2026 | 03:56pm

హైదరాబాద్: ఖేలో ఇండియా-2026 క్రీడా పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోటీల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష (Review Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా-2026 బ్రోచర్ (Brochure)ను విడుదల చేశారు.

డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు, గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఖేలో ఇండియా పోటీల సందర్భంగా నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా అలంకరణలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయం (Coordination)తో పనిచేస్తూ పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు.

స్టేడియంల పునరుద్ధరణ పనులతో పాటు క్రీడాకారులు, ప్రేక్షకులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏర్పాట్లలో నాణ్యత (Quality) విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు