కల్లూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
04-09-2026 | 11:30pm
కృష్ణుడి వేషాల్లో చిన్నారుల సందడి
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు పట్టణంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు(Krishnashtami celebrations) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చిన్నారులు రాధాకృష్ణులు, గోపికల వేషధారణలతో అలరించారు. ఆలయాల్లో భజనలు, కీర్తనలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.






