అమ్మ ఆశయం కోసం.. ఎంబీబీఎస్ సీటు సాధించిన చందన
04-09-2026 | 11:47pm
- తల్లి కన్న కలను నిజం చేసిన కూతురు
కొండపాక,(విజయక్రాంతి): తల్లి తనను డాక్టర్‌గా చూడాలన్న కలను నిజం చేసేందుకు కొండపాక మండల(Kondapaka Mandal) కేంద్రానికి చెందిన కొమ్ము చందన పట్టుదలతో చదివింది. తల్లి కవిత కన్న కల నెరవేరకముందే ఆమె మృతి చెందడంతో.. ఆ ఆశయాన్నే లక్ష్యంగా చేసుకున్న చందన నీట్‌లో 411 మార్కులు సాధించి ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో(Asifabad Government Medical College) ఎంబీబీఎస్ సీటు(MBBS seat) సాధించింది. తల్లి లేకపోయినా ఆమె కలను సాకారం చేసిన చందనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.






