మంజీరలో అక్రమ ఇసుక తవ్వకాలు.. డోజర్, బొలెరో పట్టివేత
06-09-2026 | 08:57am
బోధన్,సెప్టెంబర్ 06(విజయక్రాంతి): సాలూర మండలం తగ్గేల్లి మంజీర నది నుంచి రాత్రివేళల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్ నవాజ్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి ఆర్‌ఐ శంకర్ మంజీర నదిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న డోజర్,బోలెరోను అధికారులు పట్టుకున్నారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు . అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.






