జలాల్పూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని జలాల్పూర్ గ్రామంలో(Jalalpur Village) నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ప్రారంభించడం జరిగింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు బచ్చ మంజులకు నూతన ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగింది. లబ్ధిదారులు బచ్చ మంజుల నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మించారు. దానితో గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్ నూతన ఇందిరమ్మ ఇల్లు రిబ్బన్ కట్ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్(Nizampet Sarpanch Srinivas Goud) మాట్లాడుతూ...తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఎప్పుడు నిరంతరం పేదల కోసం పోరాడుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని తెలిపారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు బచ్చ మంజుల మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) స్థానిక నాయకులు తమ నిరుపేద కుటుంబానికి గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు స్థానిక నాయకులకు తాము ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్, కార్యదర్శి వెంకట రాములు, వార్డ్ మెంబర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.






