6 September, 2026 | 11:29 AM

ఉత్తమ ఉపాధ్యాయులుగా వెంకటేశ్వర రెడ్డి, కోట ఫ్రాన్సిస్

06-09-2026 | 09:15am

తల్లాడ, (విజయక్రాంతి): గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తల్లాడ మండలానికి చెందిన కె. వెంకటేశ్వర రెడ్డి, కోట ఫ్రాన్సిస్ చోటు దక్కించుకున్నారు. మండల విద్యాశాఖ అధికారి దామోదర ప్రసాద్ సమక్షంలో వీరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ సభలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా కె. వెంకటేశ్వర రెడ్డి, కోట ఫ్రాన్సిస్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు. విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ, విద్యాబోధనలో చూపిన నిబద్ధత, ప్రతిభను గుర్తించిన జిల్లా అధికారులు వీరిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన జిల్లా అధికారులకు, మండల విద్యాశాఖ అధికారి దామోదర ప్రసాద్‌కు, తోటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు