ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3కె రన్
జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
పటాన్ చెరు, సెప్టెంబర్ 6: పటాన్ చెరు ఎండిఆర్ (MDR) ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్‌చెరులో "రన్ ఫర్ నేచర్" (Run for Nature) 3K రన్ ఆదివారం ఉదయం ఓ ఆర్ ఆర్ బైపాస్ పైన అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరై జెండా ఊపి 3కే రన్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా ఈ పరుగును ఏర్పాటు చేశారు. పర్యావరణ స్పృహను పెంపొందించడం, స్వచ్ఛమైన గాలి మరియు హరిత భవిష్యత్తు కోసం అవగాహన కల్పించడం.MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ నేతృత్వంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ఎన్టీఆర్ ఫౌండేషన్ సభ్యులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, చిన్నారులు పాల్గొన్నారు.






