బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

19-10-2026 | 12:44pm

తాడ్వాయి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితులకు సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గైని శివాజీ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ఆర్థిక సహాయం (Financial Assistance) అందించే చెక్కులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గంట బాలరాజు, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు కరావత్ అలీ, నాయకులు మహమూద్ అలీ, గంట ప్రశాంత్, రాజయ్య, అజీమ్, సందీప్, రాములు, బాలనర్సు, రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు