ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టీజీ ఆర్టీసీ బస్సు
అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 19: ఆగి ఉన్న లారీని టీజీ ఆర్టీసీ బస్సు (TG RTC Bus) ఢీకొట్టిన ఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బాటసింగారం స్టేజ్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వస్తున్న టీజీ ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.