చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి... భావితరాలకు ఆదర్శం
మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వీర నారి ఐలమ్మనేనని జవహర్ నగర్ మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని అంబేద్కర్ నగర్ దోభి ఘాట్ లో గురువారం వీరనారి చాకలి ఐలమ్మ(chakali ilamma) 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్(Former mayor shanti kotesh goud) హాజరై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం సమర్పించి నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిరంకుశత్వానికి దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు ఆత్మగౌరవ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయక మని పేర్కొన్నారు. పేదలు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని తెలిపారు. అనంతరం పాల్గొన్న పలువురు నేతలు ఆమె ధైర్య సాహసాన్ని పోరాటపటిమను స్లాగించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ కాంగ్రెస్ నాయకులు బల్లి శ్రీనివాస్ గుప్తా, మాట్ల వినయ్, డిఎస్ఎస్ వెంకటేశ్వర్లు, గజ్వేల్ శంకర్, పొలాస సాయి, రఫీ, మంద ఆనంద్, రాజు యాదవ్, వెంకటయ్య, స్వామి, కరుణాకర్, ముక్క నర్సింహులు, నాయకులు చాగంటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.