తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

10-09-2026 | 09:49pm

తాహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

గంభీరావుపేట,(విజయక్రాంతి) సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని గంభీరావుపేట(Gambhiraopet) బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ ఆధ్వర్యంలో  బిజెపి నాయకులతో కలిసి తాహసిల్దార్  కు వినతి పత్రం అందజేశారు. రమేష్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17 కు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటం రజాకార్ల దమన కాండను ఎదిరించి సాధించిన విమోచన దినం వేలాది మంది ప్రజల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమైన చరిత్ర అని అందుకే ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించాలని అన్నారు.

మరిన్ని వార్తలు