కార్మిక సంకల్ప యాత్రతో కదంతోక్కిన కార్మికులు
మహబూబాబాద్,(విజయక్రాంతి): కార్మికుల సమస్యల పరిష్కారమే మజ్దూర్ యూనియన్ ప్రధాన లక్ష్యం అని జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులు, వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్(Warangal Branch Secretary Yugandhar Yadav) పేర్కొన్నారు. వరంగల్ బ్రాంచ్ 3వ బీఈసీ సమావేశం(Warangal Branch 3rd BEC Meeting) సందర్బంగా వరంగల్ నుండి ఎలుగురు వరకు కార్మికులను కలుసుకుని వారి కష్టాలను మజ్దూర్ యూనియన్ నాయకులు తెలుసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో 3వ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం వరంగల్లో జరిగింది.
ఈ సమావేశంలో వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ, జోనల్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఎ. యుగంధర్ యాదవ్, వరంగల్ బ్రాంచ్ చైర్మన్ చింతల ముకుందంతో పాటు పలువురు యూనియన్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ బ్రాంచ్ పరిధిలోని వరంగల్, చింతలపల్లి ఎలుగురులలో విభాగాల్లో పనిచేస్తున్న రైల్వే కార్మికుల ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంజినీరింగ్, ఎస్సీ ఎస్టీ, కమర్షియల్, ఆపరేటింగ్, స్టోర్స్, సివిల్ తదితర విభాగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ నాయకుల దృష్టికి తీసుళ్లారు యూనియన్ తరుపున పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
మూడవలైన్ ఏర్పాటుతో యార్డ్ లలో కీమెన్ డ్యూటీ భారం అవుతున్నాయని అడిషనల్ కిమెన్ ను ఏర్పాటు చేయాలనీ కోరారు. చింతలపల్లి స్టేషన్లో ఆన్ లోడింగ్ పాయింట్ ఏర్పాటు చేసినప్పటికి సరైన స్టాఫ్ లేక స్టేషన్ మాస్టర్, పాయింట్స్మెన్ లకు అధిక పని భారం పడుతుందని తక్షణమే పని భారం తగ్గించేలా ఏర్పాటు చేయాలని కోరారు. ఎలుగురులో ఇంజినీరింగ్ కార్మికులకు మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్ లో టికెట్ చెకింగ్ స్టాఫ్ రూము వెంటిలేషన్ కొరకు కిటికీ పెద్దది ఏర్పాటు చేయాలని కొరకు ఈ సందర్బంగా మజ్దూర్ యూనియన్ నాయకులు పైన విషయాలు అన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.
కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు మజ్దూర్ యూనియన్ ప్రతి సంవత్సరం కార్మిక సంకల్ప యాత్ర ద్వారా అందరి కార్మికుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ కోశాధికారి సంగీత, అసిస్టెంట్ సెక్రెటరీలు రాజేష్, సురేష్, వైస్ చైర్మన్ లు భాస్కర్ రావు,సుధాకర్, రామకృష్ణ, రవీందర్ మహిళశక్తి నాయకులు స్వాతి మజ్దూర్ యూనియన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లూరి రమేష్, ప్రెసిడెంట్ రాజేష్, సెక్రెటరీ చారి, కోశాధికారి కుమార్,యూత్ లీడర్స్ రాజు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.