నేడు నిరసన ర్యాలీ

09-10-2026 | 06:27pm

నిర్మల్ అక్టోబర్ 9 ( విజయక్రాంతి) : నిర్మల్‌ జిల్లా(Nirmal District) కేంద్రంలో ఇండియా కూటమి(INDIA Alliance) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న నిరసన ర్యాలీని(Protest rally) నిర్వహిస్తున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు(Kuchadi Srihari Rao) తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌(Gyanesh Kumar) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు(Amit Shah) అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

స్థానిక మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ చౌక్ నుండి ఉదయం 11 గంటలకు ర్యాలీ ప్రారంభమై ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ నిరసన పాదయాత్ర ర్యాలీలో ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు