ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి

31-10-2026 | 10:18pm

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కురాన్నపేట్ కాలనీకి చెందిన తోకల సాయన్న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister Relief Fund) నుంచి మంజూరైన రూ. 3.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Nirmal MLA Aleti Maheshwar Reddy) శనివారం తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు(Medical Expenses) భరించలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందేలా చొరవ చూపిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాప ప్రసాద్, జుట్టు దినేష్, కందుల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు