నీటి విడుదలకు చర్యలు

24-10-2026 | 05:19pm

నిర్మల్ అక్టోబర్ 24 ( విజయక్రాంతి) : వరి పంటకు(Paddy crop) సరస్వతి కాలువ(Saraswati Canal) ద్వారా మరో తడి సాగునీరు(Wet irrigation) అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల్ నియోజకవర్గం(Nirmal Constituency) కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. సరస్వతి కాలువ ద్వారా సాగునీటి విడుదల నిలిచిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామ రైతులు(Farmers) ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వరి పంట పొట్ట దశలో ఉందని మరో తడి నీరు అందకపోతే చేతికొచ్చే పంట ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

స్పందించిన శ్రీహరి రావు రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి శ్రీరామ్ సాగర్ జలాశయం(Sriram Sagar Reservoir) నుండి సరస్వతి కాలువ ద్వారా మరో తడికి నీటిని విడుదల చేయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు రైతులు పేర్కొన్నారు. ఇందులో రైతులు గడ్డం స్వామి, పెద్ద లక్ష్మన్న, చింతకింది గంగాధర్, పీఏసీఎస్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, నర్సారెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు