పిఆర్టియు మండల శాఖ అధ్యక్షులుగా కనకయ్యా
20-09-2026 | 03:51pm
చేగుంట సెప్టెంబర్ 20,విజయక్రాంతి: మాసాయిపేట మండల ఉపాధ్యాయ సంఘం(Teachers' Union) పిఆర్టీయు మండల అధ్యక్షులుగా కనకయ్య, ప్రధాన కార్యదర్శి దయాకర్,మహిళా అధ్యక్షురాలుగా భాగ్యలక్ష్మి ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా అధ్యక్షులు కనకయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ప్రాథమిక సభ్యునికి,ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరిస్తూ సంఘ అభివృద్ధికి అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు.
ఈ ఎన్నికల కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మేడి సతీష్ రావు, ప్రధాన కార్యదర్శి సామ్యా నాయక్, గౌరవాధ్యక్షులు సబ్బాని శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు సుంకరి కృష్ణ, తాళ్ల శ్రీనివాస్ వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు