జివెన్‌ ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు

19-09-2026 | 05:29pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్‌ పట్టణానికి చెందిన జివెన్‌ అల్లూరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.  మూడు సంవత్సరాల వయసులో జ్ఞాపకశక్తి,లో విషయాలను వేగంగా గుర్తించే సామర్థ్యంతో పలు పురస్కారాలు, రికార్డు సంస్థల గుర్తింపులను సొంతం చేసుకున్నాడు.జివెన్‌ ప్రతిభను గుర్తించిన ఇంటర్నేషనల్‌ స్టార్‌ కిడ్స్‌ అవార్డ్స్‌ సంస్థ(International Star Kids Awards Organization) ‘ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెమరీ’ విభాగంలో ‘స్టార్‌ కిడ్‌’ అవార్డుతో సత్కరించింది. అలాగే ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(International Book of Records) నుంచి ‘సూపర్‌ టాలెంటెడ్‌ కిడ్‌’, ‘వన్‌ ఇన్‌ ఎ మిలియన్‌’గా గుర్తింపు పొందాడు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కూడా జివెన్‌ను ‘ఐబీఆర్‌ అచీవర్‌’గా ఎంపిక చేసింది.

మూడేళ్లు నిండకముందే జివెన్‌ సుమారు 100 రకాల జంతువులు, పక్షులు, కీటకాలను గుర్తించి, వాటి పేర్లను చెప్పగలుగుతున్నాడు. అదేవిధంగా 70 రకాల వాహనాలు, 50 కార్ల లోగోలు, 24 రంగులు, 12 ఆకారాలు, 39 రకాల పండ్లు, కూరగాయలను గుర్తించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. చిన్న వయస్సులోనే ఇంతటి జ్ఞాపకశక్తి, గుర్తింపు సామర్థ్యాన్ని కనబరచడం విశేషంగా నిలిచింది.జివెన్‌ నిర్మల్‌లో వైద్య సేవలు అందిస్తున్న న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ మనోజ్‌ భరత్‌, పీడియాట్రిషియన్‌ డాక్టర్‌ దివ్య దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే జివెన్‌ ఆసక్తిని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ప్రోత్సహిస్తూ కొత్త విషయాలను నేర్చుకునేలా చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జివెన్‌ సాధిస్తున్న గుర్తింపులు కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులతో పాటు, నిర్మల్‌ ప్రజల్లో ఆనందం నింపుతున్నాయి.

మరిన్ని వార్తలు