కుటుంబానికి అండగా ఉంటాం
31-10-2026 | 10:12pm
ఖానాపూర్,(విజయక్రాంతి): సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కొరిపల్లి రాజిరెడ్డి(Former PACS Director Koripalli Rajireddy) (62) కుటుంబానికి అండగా ఉంటామని మాజీ జడ్పీ చైర్మన్ శోభారాణి సత్యనారాయణ గౌడ్(Former ZP Chairman Shobharani Satyanarayana Goud) అన్నారు.
ఆయన మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యం కల్పించారు. రాజిరెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన వెంట జఫ్రాపూర్ మాజీ సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, మంజులాపూర్ పిఎసిఎస్ ఉపాధ్యక్షులు బర్మ గంగా దాస్, పిఎసిఎస్ డైరెక్టర్ రమేష్ రెడ్డి ఉన్నారు.