ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

23-10-2026 | 07:33pm

 స్వామివారి నిత్య రాబడి  21,13,831/-...

యాదగిరిగుట్ట, అక్టోబర్ 23 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో (Sri Lakshmi Narasimha Swamy Temple)నిత్య  కైంకర్యాలు  శాస్త్రోక్తంగా   పండితులు నిర్వహించారు. శుక్రవారం శ్రీ స్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. శ్రీ స్వామివారి నిత్య రాబడి 21,11,831/-వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు