గజ్వేల్‌లో అలాయ్ బలాయ్ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

23-10-2026 | 07:44pm

పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలంతా పాల్గొనాలి

గజ్వేల్, అక్టోబర్ 23: దసరా పండుగను(Dasara Festival) పురస్కరించుకుని గజ్వేల్‌లో(Gajwel) తొలిసారిగా నిర్వహించనున్న అలాయ్ బలాయ్ దసరా ఆత్మీయ సమ్మేళనాన్ని(Alai Balai – A Dussehra Get-Together) విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పొన్నాల కుమార్, నీరుడి స్వామి, బాకీ స్వామి ముదిరాజ్, సంఘపు కన్న యాదవ్, కొడకండ్ల నర్సింలు మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ ఆదివారం తూప్రాన్ రోడ్డులోని టీ. లక్ష్మణ్ గార్డెన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాయ్ బలాయ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పార్టీలకు అతీతంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యత, సోదరభావాన్ని చాటాలని కోరారు. గజ్వేల్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సమ్మేళనానికి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు