ఆదర్శ రైతుగా గాదె నర్సిరెడ్డికి పురస్కారం
కిసాన్ దివస్ సందర్భంగా మంత్రి తుమ్మల చేతుల మీదుగా అవార్డు
బూర్గంపాడు,(విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో(Agricultural Sector) విశేష సేవలందిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన గాదె నర్సిరెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఆయన సేవలను గుర్తించిన కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో 2026 కిసాన్ దివస్ సందర్భంగా ఆదర్శ రైతు అవార్డుకు ఎంపిక చేసి సత్కరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా నర్సిరెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
వ్యవసాయ రంగంలో ఆయన అందించిన సేవలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన రైతుకు రాష్ట్ర స్థాయిలో గౌరవం లభించడంపై స్థానిక రైతులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సిరెడ్డికి లభించిన పురస్కారం ఇతర రైతులకు సైతం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.