పోలీసులకు వ్యాసరచన పోటీలు
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 23(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమీషనరేట్(Karimnagar Police Commissionerate) కేంద్రంలో శుక్రవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో(Police Martyrs' Commemoration Week) భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు(Essay Writing Competitions) నిర్వహించారు. కమీషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్(Police Constable) నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి "పోలీసు అధికారుల జీవితాలలో సోషల్ మీడియా(Social Media) పాత్ర దాన్ని వ్యసనాన్ని ఆదిగమించి వ్యక్తిగత సామాజిక ప్రయోజనాలకోసం సద్వినియోగం చేసుకోవడం ఎలా " అనే అంశంపై నిర్వహించారు.
ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు "పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి" అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కమీషనరేట్‌కు చెందిన అన్ని పోలీసు స్టేషన్లు , విభాగాల నుండి మొత్తం 90 మంది పోలీసులు ఈ పోటీలో పాల్గొన్నారు.