6 September, 2026 | 10:18 AM

దళిత ఆత్మగౌరవ సభకు తరలిరండి

06-09-2026 | 08:55am

ప్రజాసంఘాల పిలుపు

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో(Khanapur town) ఆదివారం జరుపతలపెట్టిన దళిత ఆత్మగౌరవ సభ, చలో ఖానాపూర్ కు వేలాదిగా దళిత ప్రజలు తరలిరావాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు గత కొన్ని రోజులుగా దళిత నాయకులు సంగర్తి రాజన్న, బొమ్మెన రాకేష్, రాజ్ కుమార్ ,రాచమల్ల అశోక్, ఆధ్వర్యంలో మామడ, ఖానాపూర్, పెంబి ,కడం ,దస్తురాబాద్, మండలాల్లోని పలు గ్రామాల్లో చలో ఖానాపూర్ పోస్టర్లను ఆవిష్కరిస్తూ ప్రజలకు పిలుపునిచ్చారు. పెంబి మండలంలోని దళిత మహిళ నివాసం ఉంటున్న ఇంటిని ఆ గ్రామ వీడిసి ఆధ్వర్యంలో కూల్చివేసి మహిళా కుటుంబాన్ని రోడ్డుపాలు చేసినందుకు నిరసనగా న్యాయం కావాలంటూ దళిత సంఘాలు పోరు బాట పట్టాయి. ఆదివారం పట్టణంలోని ఏ ఏం కే ఫంక్షన్ హాల్ లో జరగనున్న ఆత్మగౌరవ సభకు రాష్ట్ర నాయకులు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు