విలీనం పేరుతో పేద విద్యార్థులకు విద్యను దూరం చేయొద్దు!
- తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానాన్ని పునఃపరిశీలించాలి
- గ్రామీణ పాఠశాలల మనుగడకు ముప్పు.. జీవోలను రద్దు చేయాలి
- స్వేరోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోండ్రు రామచంద్రు, సోంపొంగు శ్యాంసుందర్
ఖమ్మం టౌన్, నవంబర్ 12(విజయకాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను(Government School) విలీనం చేసే పేరుతో పేద విద్యార్థులకు విద్యను దూరం చేయొద్దని స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు(Sweros District President) కోండ్రు రామచంద్రు, ప్రధాన కార్యదర్శి సోంపొంగు శ్యాంసుందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పాఠశాలల సమీకరణ విధానం గ్రామీణ విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
గురువారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చిన్నచిన్న ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్య అందించాలనే ప్రతిపాదనతో గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్, మోడల్ స్కూల్స్, కేజీబీవీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశముందని తెలిపారు. తండాలు, గూడేలు, మారుమూల గ్రామాల్లో నివసించే పేద కుటుంబాల పిల్లలు స్థానికంగానే చదువుకునే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు.
ఐదేళ్లలోపు చిన్నారులు, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు రోజూ ఐదు నుంచి పది కిలోమీటర్లు ప్రయాణించి పాఠశాలలకు వెళ్లాల్సి వస్తే వారి చదువుపై ప్రభావం పడుతుందని అన్నారు. సరైన రవాణా సదుపాయాలు లేకపోతే బాలబాలికలు బడికి దూరమయ్యే ప్రమాదముందని పేర్కొన్నారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేకపోతే పేద తల్లిదండ్రులు అప్పులు చేసి ప్రైవేటు పాఠశా