చిన్నారి కల నెరవేర్చిన ఎంపీ

12-11-2026 | 08:01pm

మాట ఇచ్చిన 36 గంటల్లోనే సైకిల్ బహుమతి

సుల్తానాబాద్, ఎలిగేడు,  నవంబర్ 12 (విజయ క్రాంతి): విద్యార్థినికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Peddapalli MP Gaddam Vamshikrishna) తన ప్రత్యేకతను చాటుకున్నారు. హామీ ఇచ్చిన కేవలం 36 గంటల్లోనే ఐదో తరగతి విద్యార్థిని సాయి విజ్ఞతకు గురువారం సైకిల్‌ను బహుమతిగా అందజేశారు.ఇటీవల పెద్దపల్లి జిల్లా  ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఎంపీ వంశీకృష్ణ సందర్శించారు.

ఈ సందర్భంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.జిల్లాస్థాయిలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్‌లో మొదటి బహుమతి సాధించిన ఐదో తరగతి విద్యార్థిని సాయి విజ్ఞత ప్రతిభను అభినందించిన ఎంపీ, ఆమెకు సైకిల్ బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం కేవలం 36 గంటల్లోనే సైకిల్‌ను అందజేసి చిన్నారి కలను నెరవేర్చారు. సైకిల్ అందుకున్న సాయి విజ్ఞత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మాట నిలబెట్టుకున్న ఎంపీ వంశీకృష్ణకు పాఠశాల ఉపాధ్యాయులు, సాయి విజ్ఞత తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డగుంట శ్రీనివాస్ పలువురు ఉన్నారు...

మరిన్ని వార్తలు