తలసేమియా బాధితులకు చేయూత

12-11-2026 | 08:04pm

ఖమ్మం విజయక్రాంతి: తలసేమియా వ్యాధితో(Thalassemia disease) బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన కృషితో జిల్లాలోని సుమారు 150 మంది తలసేమియా బాధితులకు చేయూత పింఛన్లు మంజూరు కానున్నాయి.

గతంలో ఎంపీగా ఉన్న సమయంలోనూ బాధితుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించారు. ప్రస్తుతం మంత్రిగా వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు. చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ఈ పింఛన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా గురువారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఉపాధ్యక్షురాలు పొద్దుటూరి పావని ఆధ్వర్యంలో 20 మందికి పైగా బాధితులు మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డిని కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్నారుల కష్టాలను గుర్తించి అండగా నిలిచిన మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అనిత, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు