ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న మహా పాదయాత్ర
బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్ అక్టోబర్ 27 ( విజయక్రాంతి): దేశంలో సర్ పై దుష్ప్రచారం చేస్తున్న అఖిలభారత కాంగ్రెస్ పార్టీ వైఖరి నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి(BJP leader Maheshwar Reddy ) తెలిపారు. నవంబర్ 3న నిర్మల్లో నిర్వహించనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులకు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యక్రమ విజయవంతానికి అనుసరించాల్సిన కార్యాచరణపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులకు పలు సూచనలు చేశారు. యాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్,బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్, రమణారెడ్డి, ముత్యం రెడ్డి,మెడిసెమ్మ రాజు, భూమయ్య, సామ రాజేశ్వర్ రెడ్డి, సరికెల గంగన్న, పట్టణ, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.