విజయ గణపతి దేవాలయంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
రూ.38 వేలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్న ఓరుగంటి నిఖిల్
హాజరైన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని విజయ గణపతి దేవాలయం(Vijaya Ganapathi Temple)లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి లడ్డూ వేలంపాట భక్తుల ఉత్సాహం నడుమ పోటీపోటీగా సాగింది. ఇందులో ఓరుగంటి నిఖిల్ రూ.38,000 కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(Former MLA Bollam Mallaiah Yadav) ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఓరుగంటి వెంకట బ్రహ్మం, ఓరుగంటి రాము, ఓరుగంటి నవీన్ కుమార్ లు మహా అన్నదాతలుగా వ్యవహరించి అన్న ప్రసాద వితరణ చేశారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ఓరుగంటి నారాయణ అండ్ ధనలక్ష్మి జువెలర్స్ నిర్వాహకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోలిశెట్టి కృష్ణయ్య, చలపటి శివ, గోపారపు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.